National5th Oct 02:19 PMSunil Byrisetty1 min read
1.84 లక్షల కోట్లు బ్యాంకుల్లో..!
దేశంలో 1.84 లక్షల కోట్ల డబ్బు బ్యాంక్ డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్ ఫండ్, షేర్లు ఇలా వివిధ రూపాల్లో అన్ క్లెయిమ్ నగదు ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మొత్త
దేశంలో 1.84 లక్షల కోట్ల డబ్బు బ్యాంక్ డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్ ఫండ్, షేర్లు ఇలా వివిధ రూపాల్లో అన్ క్లెయిమ్ నగదు ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మొత్తాలను అర్హులైన వారికి చేరేలా అధికారులు ఈ మూడు నెలల్లో అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు. సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని ఆమె కోరారు. ఈ సొమ్ముకు ప్రభుత్వం కస్టోడియన్ గా వ్యవహరిస్తోందన్నారు. అన్ క్లెయిమ్ డిపాజిట్ల కోసం ఆర్బీఐ ఒక పోర్టల్ ను రూపొందించిందని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమకు చెందిన నగదును క్లెయిమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంక్లపై ఉందన్నారు. అవసరమైతే గ్రామాల్లోనూ బ్యాంక్లు ప్రచారం నిర్వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కోరారు.