Politics22nd Aug 11:42 AMSunil Byrisetty1 min read
వైసీపీ పార్లమెంటరీ పార్టీలో అనూహ్య పరిణామాలు?
వైసీపీ పార్లమెంటరీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. త్వరలో మరికొందరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వైసీపీ ఎం
వైసీపీ పార్లమెంటరీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. త్వరలో మరికొందరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది. మొత్తం 11 మంది వైసీపీ సభ్యుల్లో ఇప్పటికే మోపిదేవి, బీద మస్తాన్‌రావు, ఆర్.క్రిష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీ వీడారు. వైసీపీ లోక్‌సభ సభ్యుల్లో ఒకరు జైల్లో ఉండగా, మరొకరు హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిగిలిన ఏడుగురు ఎంపీలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.