News21st Jul 03:01 PMSunil Byrisetty1 min read

ఉపరాష్ట్రపతితో కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీ

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప

ఉపరాష్ట్రపతితో కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీ
ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ సహకారం తదితర అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రగతి, రైతుల అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
Andhra Pradesh
Vice President
C P Radhakrishnan
Rammohan Naidu
Atchannaidu
ఆంధ్రప్రదేశ్
రైతు సంక్షేమం
వ్యవసాయం
రాష్ట్ర అభివృద్ధి
కూటమి ప్రభుత్వం
Scroll for the next article