News28th Mar 05:16 PMSunil Byrisetty1 min read

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందు గుడ్‌న్యూస్‌ వచ్చింది. వారి డియర్‌నెస్‌ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వివరాల

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందు గుడ్‌న్యూస్‌ వచ్చింది. వారి డియర్‌నెస్‌ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. డీఏ సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్‌ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. పండుగ ముందు ప్రకటన రావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.
Union Cabinet
DA Hike
Central Govt Employees
Scroll for the next article