News29th May 09:13 AMSunil Byrisetty1 min read
14 పంటలకు మద్దతు ధర పెంపు
కేంద్ర క్యాబినెట్ దేశంలో14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడికి 50% లాభం ఉండేలా ధరలు పెంచింది. ఇందులో భాగంగా వరి క్వింటాల్‌కు రూ.69 పెంచటంతో ఇప్
కేంద్ర క్యాబినెట్ దేశంలో14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడికి 50% లాభం ఉండేలా ధరలు పెంచింది. ఇందులో భాగంగా
వరి క్వింటాల్‌కు రూ.69 పెంచటంతో ఇప్పుడు రూ. 2,369 అయ్యింది. అలాగే జొన్నలు రూ.328, సజ్జలు రూ.150 పెంపు పేర్కొంది. రాగులు రూ.596, వేరుశెనగ రూ.480 పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450 పెంపు ద్వారా కనీస మద్దతు కల్పిస్తోంది. అలాగే పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంపు
పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436
కుసుములు రూ.579, ఒలిసెలు రూ.820 పెంపు. పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంచుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.