Politics7th Apr 01:02 PMSunil Byrisetty1 min read

జమిలి అప్పుడే కాదు.. 2034 తర్వాతే!

2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ఏకకాల ఎన్నికలు జరుగుతాయని స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలకు ప్రస్తు

జమిలి అప్పుడే కాదు.. 2034 తర్వాతే!
2029లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ఏకకాల ఎన్నికలు జరుగుతాయని స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం దాదాపు రూ. లక్ష కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని వివరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా డబ్బును ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే.. దేశ GDPకి దాదాపు 1.5 శాతం వృద్ధి పెరుగుతుందన్నారు. విలువ పరంగా, ఆర్థిక వ్యవస్థకు.. 4.50 లక్షల కోట్లు అదనంగా వస్తాయని వివరించారు. "ఒక దేశం ఒకే ఎన్నిక"పై... కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీతారామన్ ఆరోపించారు. ఏమీ తెలుసుకోకుండా వ్యతిరేకించడం సరికాదన్నారు. అయితే జమిలిపై ఆశలు పెట్టుకున్న వైయస్సార్సీపీకి ఇది పెద్ద దెబ్బేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
One Nation One Election
Jamili Elections
Minister Nirmala Seetharaman
2029 జమిలి ఎన్నికలు
Scroll for the next article