News3rd Sep 01:32 PMSunil Byrisetty1 min read
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు అమిత్ షా
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ చేరుకొని ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో సమ
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ చేరుకొని ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఎంజే మార్కెట్ ప్రాంతంలో వినాయకుడి శోభాయాత్రలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి, బీజేపీకి సమాచారం అందింది. అమిత్ షా రాక నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.