National30th Jun 03:17 PMSunil Byrisetty1 min read

పేద ఖైదీలకు కేంద్రం ఆర్థిక సాయం!

బెయిల్ కోసం డబ్బులు చెల్లించలేని పేద ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరైనా పూచీకత్తు చెల్లించలేని వాళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తున్న పరిస్థితిని గుర్తించింది.

పేద ఖైదీలకు కేంద్రం ఆర్థిక సాయం!
బెయిల్ కోసం డబ్బులు చెల్లించలేని పేద ఖైదీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెయిల్ మంజూరైనా పూచీకత్తు చెల్లించలేని వాళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తున్న పరిస్థితిని గుర్తించింది. పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది. రిమాండ్‌తో పాటు శిక్షపడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం రూ.40 వేల లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్‌కు సెంట్రల్‌ నోడల్ ఏజెన్సీ (CNA)గా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. జరిమానా రూ.40 వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ద్వారా పరిశీలించి విడుదల చేస్తుంది. అయితే డ్రగ్స్, మనీ ల్యాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్టయిన వాళ్లకి ఈ పథకం వర్తించదు.
India news
SUPPORT TO POOR PRISONERS SCHEME
BAIL POOR PRISONERS SCHEME
FINANCIAL ASSISTANCE POOR PRISONERS
పేద ఖైదీల బెయిల్కు ఆర్థిక సాయం
కేంద్ర హోంశాఖ పేద ఖైదీలకు మద్దతు పథకం
Scroll for the next article