News10th Apr 08:44 AMSunil Byrisetty1 min read

తెలుగు రాష్ట్రాల విభజన చట్టంపై కేంద్రం కసరత్తు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత విభజన చట్టంలోని చాలా సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించి

తెలుగు రాష్ట్రాల విభజన చట్టంపై కేంద్రం కసరత్తు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత విభజన చట్టంలోని చాలా సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. విభజన చట్టం-2014లోని షెడ్యూల్ 9, 10లలోని సంస్థలు, ఆస్తుల విభజనపై కేంద్రం దృష్టి పెట్టింది. అదేసమయంలో ఉమ్మడి ప్రాజెక్టుల పూర్తికి కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతూ.. తాజాగా కేంద్ర హోం శాఖ నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ 9 లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం అత్యంత కీలకంగా మారింది. అదేవిధంగా షెడ్యూల్ 10 లోని ఆర్టీసీ సహా ఇతర సంస్థల విభజనను వేగంగా చేపట్టాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధుల విషయంపైనా కేంద్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీకి 350 కోట్లు, తెలంగాణకు 270 కోట్ల రూపాయలు ఇవ్వనుంది.
AP
Telangana
Bifurcation
Union Home Minister
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
విభజన చట్టం
Scroll for the next article