News20th Aug 03:34 PMSunil Byrisetty1 min read
సిఎస్, డిజిపిలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో సమావేశం
నూతన క్రిమినల్ చట్టాల పటిష్ట అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఢిల్లీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిజిపి హరీశ్ కుమార
నూతన క్రిమినల్ చట్టాల పటిష్ట అమలుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఢిల్లీ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిజిపి హరీశ్ కుమార్ గుప్తాలతో వీడియో సమావేశం నిర్వహించారు.మన దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అనగా భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టాలు పాత క్రిమినల్ చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్(IPC),క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానే అమలులోకి వచ్చాయి. ఈ నూతన క్రిమినల్ చట్టాలను క్షేత్ర స్థాయిలో పటిష్టవంతంగా అమలు చేసేందుకు వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, ఫోరెన్సిక్ లేబరేటరీల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ణానం తదితర అంశాలపై ఆయన చర్చించారు. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మాట్లాడుతూ ఫోరెన్సిక్ ఇకో సిస్టమ్ ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సిఎస్,డిజిపిలకు సూచించారు.