Spiritual5th Oct 03:52 PMSunil Byrisetty1 min read
నవరాత్రి వేడుకలకు కేంద్ర మంత్రికి ఆహ్వానం
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్–2.0కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఆహ్వానం పలికారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎన్
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్–2.0కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఆహ్వానం పలికారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీష్ బాలయోగి ఉత్సవాలకు ఆహ్వానించారు. శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కేంద్ర మంత్రికి ఆహ్వానంలో తెలిపారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్–2.0 నిర్వహిస్తున్నామన్నారు. దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌లో కేంద్ర మంత్రి భాగస్వామ్యం కావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.