News20th Dec 12:00 PMSunil Byrisetty1 min read

వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి

గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి,

వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి
గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ VIT University క్యాంపస్ లో ప్రారంభించారు. జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సేవా కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా రూపొందించడం జరిగింది. సులభంగా అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులకు అనుకూలమైన ప్రజా సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారిత, వినియోగదారుడి కేంద్రీకృత పరిష్కారాలను స్వీకరించడం ద్వారా యువతలో మారుతున్న అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా పోస్టల్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది. జెన్ జెడ్ పోస్టాఫీస్‌ను ప్రత్యేకంగా జనరేషన్ జెడ్ (Z) యువత అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Andhra Pradesh
Gen Z Post Office
VIT AP
Guntur Postal Division
Union Minister Pemmasani Chandrasekhar
Postal Department Modernisation
యువత కేంద్ర సేవలు
డిజిటల్ పోస్టల్ సేవలు
కమ్యూనికేషన్ల శాఖ
Scroll for the next article