News19th Apr 09:20 AMSunil Byrisetty1 min read
మస్కట్‌లో సిక్కోలు కార్మికులు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ భరోసా!
శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి పని, జీతం లేకుండా పలువురు కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తక్షణమ
శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి పని, జీతం లేకుండా పలువురు కార్మికులు అవస్థలు పడుతున్నారు.
ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు.
మస్కట్‌లో NASEEM AL SALAM కంపెనీలో పని లేకుండా, జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో రామ్మోహన్ నాయుడు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
అక్కడి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు.
కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరపున కార్మికులకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.