News8th Apr 08:14 PMSunil Byrisetty1 min read
కార్పొరేట్ ఆఫీసుల్లా పాస్ పోర్ట్ కార్యాలయాలు
‘వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాస్ పోర్ట్ కార్యాయాలన్నీ ఆధునీకరణతో కార్పొరేట్ ఆఫీసులుగా తయారు అవుతున్నాయి. ప్రధాన మంత్రి మోదీ సహకార
‘వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాస్ పోర్ట్ కార్యాయాలన్నీ ఆధునీకరణతో కార్పొరేట్ ఆఫీసులుగా తయారు అవుతున్నాయి.
ప్రధాన మంత్రి మోదీ సహకారంతో ఎపి కూడా అభివృద్ధి వైపు పయనిస్తుంది.
విజయవాడ రాబోయే కాలంలో అమరావతిలో కేంద్ర విదేశాంగశాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంద’ని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
పాస్ పోర్ట్ సేవా కేంద్రం, రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, వై.సుజనా చౌదరి, జాయింట్ సెక్రటరీ(పి.సి.పి), అండ్ సిపివో డా. కె.జె.శ్రీనివాస్, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ కె.శివహర్ష పాల్గొన్నారు. ఈ కార్యాలయాలను ప్రారంభించేందుకు పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర విదేశీ వ్యవహారాల,పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ సహాయ మంత్రి మంత్రి కీర్తి వర్థన్ సింగ్‌కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకటంతో పాటు శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు.
అనంతరం ఆధునీకరించిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్థన్ సింగ్‌తో కలిసి ప్రారంభించి, శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత స్టాలిన్ సెంట్రల్ మాల్‌లోని నాలుగవ అంతస్తులో రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు.