News2nd Aug 12:38 PMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి గడ్కరి
తిరుమల శ్రీవారిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని సేవించుకున్నారు. దర్శనానంతరం రం
తిరుమల శ్రీవారిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని సేవించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి గడ్కరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం తో టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఉన్నారు.