Politics25th Mar 08:52 AMSunil Byrisetty1 min read
ఈ ప్రభుత్వం రాకపోతే వెళ్లిపోయేవాళ్లన్న పెమ్మసాని
రాష్ట్రంలో పరిస్థితుల గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తనకు
రాష్ట్రంలో పరిస్థితుల గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటో తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. VIT వాళ్ళు, SRM వాళ్ళు తన వద్దకు వచ్చి ఒకే మాట చెప్పారన్నారు.
ఈసారి గనక కూటమి ప్రభుత్వం కనుక రాకపోయుంటే ఈ కాలేజీలను అద్దెకి ఇచ్చి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నామని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక కాలేజీలో 13 వేలమంది, మరో కాలేజీలో 10 వేల మంది చదువుతున్నారు.
ఇలా ఎంతో మంది కాలేజీలు వదిలి పెట్టి వెళ్ళేవాళ్ళని వారు చెప్పారనన్నారు.
4300 కోట్ల రూపాయలు ఫీ రీయిబర్సుమెంట్ కాలేజీలకు విడుదల కాక అందరూ ఇబ్బంది పడ్డారని వివరించారు.
ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి విడతలో రూ. 700 కోట్లు ఇచ్చిందన్నారు.
తాజాగా మరో రూ. 600 కోట్లు, మొత్తం 1300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని తెలిపారు.
అప్పుడు పెమ్మసాని ’మీకు ఒక మంచి డైనమిక్ మినిస్టర్ ఉన్నారు ఆయనే నారా లోకేష్, ఆయన యూనివర్సిటీలన్నీ ప్రక్షాళన చేస్తున్నార‘ని తాను చెప్పినట్లు పెమ్మసాని పేర్కొన్నారు.