News7th Oct 03:33 PMSunil Byrisetty1 min read

జపాన్ మంత్రితో కేంద్ర మంత్రి పెమ్మసాని భేటీ

జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ వైస్ మినిస్టర్ ఫుసెడా హిడియోతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ అయ్యారు. వరుసగా రెండో ఏడాది జపాన్ ఇండియా మొబైల్ కాంగ్ర

జపాన్ మంత్రితో కేంద్ర మంత్రి పెమ్మసాని భేటీ
జపాన్ అంతర్గత వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ వైస్ మినిస్టర్ ఫుసెడా హిడియోతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ అయ్యారు. వరుసగా రెండో ఏడాది జపాన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొనబోతోంది. ఈసారి 11 జపాన్ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కావడం విశేషం. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక పురోగతిని వైస్ మినిస్టర్ ప్రశంసించారు. మన ప్రధానమంత్రుల ఉమ్మడి దార్శనికతలో భాగమైన భారత్ – జపాన్ డిజిటల్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జపాన్ కట్టుబడి ఉందని తెలిపారు. భారత్‌లో డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో జపాన్ కంపెనీల భాగస్వామ్యాన్ని స్వాగతించారు. ఇరు దేశాల జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ ద్వారా సాధించిన పురోగతిపై కూడా చర్చించాం. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. అలాగే పోస్టల్ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU)లో కలిసి పనిచేసేందుకు ఉన్న కొత్త అవకాశాలపై కూడా చర్చించారు.
Scroll for the next article