News13th Sep 12:56 PMSunil Byrisetty1 min read
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలకు పెమ్మసాని
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర సీఎస్‌ఆర్ నిధులతో అ
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కళాశాలలో 2,500 మంది విద్యార్థులు చదువుకోవడం, మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల పిల్లలు అధిక శాతం చదువుకోవడం సంతోషకరమని అన్నారు. కోల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ సౌజన్యంతో విద్యార్థుల కోసం 12 కొత్త క్లాస్‌రూమ్‌ల నిర్మాణం చేపట్టడం ఆనందకరమని ఆయన తెలిపారు. భవన నిర్మాణానికి రూ. 2.50 కోట్లు కేటాయించగా, కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.