News13th Nov 03:33 PMSunil Byrisetty1 min read

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ!

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రూఫ్‌టాప్ సోలార్ పథకం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. విశాఖపట్నంలో జరు

హరిత ఇంధన కేంద్రంగా ఏపీ!
పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రూఫ్‌టాప్ సోలార్ పథకం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ‘సుస్థిర భవిష్యత్తుకు భరోసా – ఇంధన స్థితిస్థాపకత, స్వచ్ఛ సాంకేతికతలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు’ అంశంపై ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఏపీలో 5 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని తాను కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో రికార్డు సమయంలో ఏకంగా 7.86 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అనుసంధానం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను 24 గంటల్లోనే పునరుద్ధరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో 2014లో కేవలం 2.8 గిగావాట్లు ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం నేడు 175 గిగావాట్లకు చేరిందని, పీఎం సూర్యఘర్ పథకం కింద దేశవ్యాప్తంగా 66 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.
Scroll for the next article