News27th Aug 04:11 PMSunil Byrisetty1 min read
'అన్న క్యాంటీన్'లో కేంద్ర మంత్రి.. భోజనం బాగుంది!
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 'అన్న క్యాంటీన్'లో భోజనం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో పాల్గొనడానికి రామ్మోహన్ నాయుడు విచ్చేశార
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 'అన్న క్యాంటీన్'లో భోజనం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో పాల్గొనడానికి రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న 'అన్న క్యాంటీన్'లో స్థానికులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత 'అన్న క్యాంటీన్'కు చేరుకుని స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా, అక్కడి వారిని భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు.