News27th Oct 10:24 AMSunil Byrisetty1 min read

రామ్మోహన్ నాయుడు ఇంట ఎర్రన్నాయుడు

ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల, నామకరణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. చిన్నారికి శివాన్ ఎర్రన్నాయుడుగా నామకరణం చేశారు. చిన్నారికి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవ

రామ్మోహన్ నాయుడు ఇంట ఎర్రన్నాయుడు
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల, నామకరణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. చిన్నారికి శివాన్ ఎర్రన్నాయుడుగా నామకరణం చేశారు. చిన్నారికి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఆశీస్సులు అందజేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మనోహర్‌లాల్ ఖట్టర్, హర్‌దీప్‌సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రామ్మోహన్ నాయుడి మామ, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొని రామ్మోహన్ నాయుడు దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, చిన్నారిని ఆశీర్వదించారు.
Andhra Pradesh Leaders
BJP
TDP
Celebration
Ram Mohan Naidu
Shivan Errannaidu
Naming Ceremony
Delhi Event
Union Ministers
Political Leaders
JP Nadda
రాజ్‌నాథ్ సింగ్
నిర్మలా సీతారామన్
రేవంత్ రెడ్డి
నూతలపాటి వెంకట రమణ
ఆంధ్రప్రదేశ్ నేతలు
Scroll for the next article