News11th Oct 01:34 PMSunil Byrisetty1 min read

యాంటీ డ్రగ్ పార్క్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖ వి.ఎం.ఆర్.డి.ఎ సెంట్రల్ పార్క్ లో నూతనంగా సుమారు 2 ఎకరాల స్థలంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న యువగళం యాంటి డ్రగ్ గ్లో థీమ్ పార్క్ ను వర్చువల్ విధానంలో కేంద్ర పౌర విమానయక శాఖ

యాంటీ డ్రగ్ పార్క్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ వి.ఎం.ఆర్.డి.ఎ సెంట్రల్ పార్క్ లో నూతనంగా సుమారు 2 ఎకరాల స్థలంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న యువగళం యాంటి డ్రగ్ గ్లో థీమ్ పార్క్ ను వర్చువల్ విధానంలో కేంద్ర పౌర విమానయక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వి.ఎం.ఆర్.డి.ఎ సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాధన్ పాల్గొన్నారు. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను తెలియజేయటంతో పాటు యువతలో చైతన్యం కలిగించేలా ఈ యాంటీ డ్రగ్ పార్క్ ను అందుబాటులోకి తీసుకువస్తుమన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా చూసిన పలు సంఘటనల కారణంగా ఆయన డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టటం జరిగిందని తెలిపారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువ శక్తి అత్యంత ముఖ్యమైన వనరులని, అలాంటి యువత పెడత్రోవ పట్టకుండా ఇటువంటి వినూత్నమైన ఆలోచనతో VMRDA ఆద్వర్యంలో ఒక పార్క్ ను నిర్మించటం విశాఖ కే ఒక మనోహరంగా నిలుస్తుందన్నారు.
Andhra Pradesh
Anti Drug Park
Visakhapatnam
VMRDA
Youth Awareness
Drug Free Youth
Rammohan Naidu
Nara Lokesh
విశాఖలో కొత్త ఆవిష్కరణ
సామాజిక కార్యక్రమం
యువ శక్తి
వర్చువల్ ప్రారంభం
Scroll for the next article