News26th Jun 04:52 PMSunil Byrisetty1 min read

కేంద్ర మంత్రి షెకావత్‌కు అమరావతిలో ఘన స్వాగతం

రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకొని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాష్ట్ర విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికా

కేంద్ర మంత్రి షెకావత్‌కు అమరావతిలో ఘన స్వాగతం
రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకొని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాష్ట్ర విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం లో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ₹94.44 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర "యువగళం" విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బహూకరించారు.
Andhra Pradesh news
Minister Nara Lokesh
Gajendra Singh Shekhawat
Yuvagalam book
టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు అందించిన మంత్రి లోకేష్
Scroll for the next article