News24th Mar 04:11 PMSunil Byrisetty1 min read
పార్లమెంటులో అరకు కాఫీ ఘుమఘుమలు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటులో గుబాళిస్తోంది. సీఎం చంద్రబాబు అరకు కాఫీని జాతీయస్థాయిలో ప్రమోట్ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుం
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటులో గుబాళిస్తోంది.
సీఎం చంద్రబాబు అరకు కాఫీని జాతీయస్థాయిలో ప్రమోట్ చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
కేంద్రంతో మాట్లాడి ప్రధానిని, లోక్ సభ స్పీకర్ని ఒప్పించి పార్లమెంట్ ఆవరణలో ప్రతినిధులకు అరకు కాఫీ రుచి చూసే సౌకర్యం కల్పించారు.
లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
అక్కడ అరకు కాఫీ పరిమళాన్ని ఆస్వాదించారు.