News1st Apr 10:01 AMSunil Byrisetty1 min read
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్లైన్లో క్యాన్సిలేషన్!
ఆకస్మికంగా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకునే రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆన్లై్న్లో బుక్ చేసిన టికెట్ రద్దును ఆన్లైన్లో, కౌంటర్లో కొన్న టికెట్లను కౌంటర
ఆకస్మికంగా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకునే రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పటి వరకు ఆన్లై్న్లో బుక్ చేసిన టికెట్ రద్దును ఆన్లైన్లో, కౌంటర్లో కొన్న టికెట్లను కౌంటర్లోనే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉండేది.
అనుకోకుండా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే వాళ్లు తిరిగి కౌంటర్ వరకు వెళ్లడం ఇబ్బందిగా మారుతుంది.
ఈ విషయంపై రైల్వే శాఖకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుంది.
ఇక నుంచి టికెట్ కౌంటర్‌లో కొన్నా.. ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రైల్వేశాఖ ప్రయాణికుల కోసం మరో సదుపాయం అమలుచేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
ప్రయాణికులు ఇకపై తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
రైల్వే టికెట్ కౌంటర్‌లో కొన్నా.. దానిని ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
దీంతో టికెట్ కౌంటర్లపై భారం తగ్గడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.