News9th May 05:44 PMSunil Byrisetty1 min read
ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల ర్యాలీ
ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద ధళాల సారధ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు మద్దతుగా అమరావతి
ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద ధళాల సారధ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు మద్దతుగా అమరావతి రాష్ట్ర సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
సచివాలయం మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకూ ఈసంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
భారతదేశ త్రివిద దళాల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు ‘జయహో ఆపరేషన్ సిందూర్, జై జవాన్, జై భారత్,భారత్ మాతాకి జై’ వంటి నివాదాలతో ర్యాలీ నిర్వహించారు. పాక్ కాల్పుల్లో అమరుడైన రాష్ట్రానికి చెందిన ‘అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ ఉద్యోగులు పెద్దఎత్తున నినదించారు.