Telangana7th Nov 03:09 PMSunil Byrisetty1 min read
వరి నారుతో రేవంత్ రెడ్డి చిత్రం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ అందింది. కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారుతో ముఖ్యమంత్రి చిత్రప
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ అందింది. కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో వరి నారుతో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని రూపొందించారు. ఈ నెల 8న సీఎం పుట్టినరోజు నేపథ్యంలో ఈ ప్రత్యేక చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు వరి నారును ఉపయోగించి సీఎం రూపాన్ని పొలంలోనే తీర్చిదిద్దారు. ఈ చిత్రం కోసం సుమారు 20 రోజుల పాటు శ్రమించారు. ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేయడంతో ఆయనపై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. పొలంలో ప్రత్యేకంగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.