News20th Aug 01:09 PMSunil Byrisetty1 min read

మంగళగిరి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దీర్ఘ సుమంగళీభవ

మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు పెండ్లి కానుకను అందించాలనే లక్ష్యంతో దీర్ఘ సుమంగళీభవ కార్యక్రమం పేరుతో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ

మంగళగిరి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దీర్ఘ సుమంగళీభవ
మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు పెండ్లి కానుకను అందించాలనే లక్ష్యంతో దీర్ఘ సుమంగళీభవ కార్యక్రమం పేరుతో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ల చిరంజీవి బంగారు మంగళ సూత్రాలను అందజేస్తiన్నారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలో జరిగే వివాహాలకు పెండ్లి కానుకగా నవ వధూవరులకు మంత్రి లోకేష్ స్థానిక టీడీపీ నేతల చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందజేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకున్న నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ల చిరంజీవి తన సొంత ఖర్చులతో దళిత కుటుంబాల వివాహాల సందర్భంగా సుమారు రూ.9వేల విలువైన బంగారు మంగళ సూత్రాలను కానుకగా అందజేస్తున్నారు. గత మూడేళ్ల క్రితం 2022 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజు ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ నియోజకవర్గంలోని 255 మంది దళితులకు బంగారు మంగళ సూత్రాలను పంపిణీ చేశారు. వివాహానికి వారం రోజుల ముందు టీడీపీ కార్యాలయంలో ఆహ్వాన పత్రిక అందజేస్తే వరుని కుటుంబానికి బంగారు మంగళ సూత్రం అందజేస్తామని తెలిపారు. కనుక నియోజకవర్గంలోని దళిత కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరారు.
Andhra Pradesh
Mangalagiri
Dalit Families
Deergha Sumangaleebhava
Nara Lokesh
TDP
Kanikalla Chiranjeevi
Gold Mangalsutra
Wedding Gifts
మంగళగిరి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దీర్ఘ సుమంగళీభవ
Scroll for the next article