Technology15th Oct 05:48 PMSunil Byrisetty1 min read
తెలియని నంబర్లు తెలిసే నిబంధన
తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అన్ని టెలికాం సంస్థలు 'కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్' సేవను
తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అన్ని టెలికాం సంస్థలు 'కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్' సేవను తప్పనిసరిగా అందించాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త విధానంతో వినియోగదారులకు ఫోన్ చేసే వారి పేరు, నంబర్‌తో సహా కనిపిస్తుంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక, 4G లేదా 5G నెట్‌వర్క్‌లలో మీకు ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు, కాల్ చేసే వారి నంబర్‌తో పాటు వారి పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ ఆ నంబర్ మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసి ఉంటే, మీరు సేవ్ చేసుకున్న పేరే కనిపిస్తుంది. సేవ్ చేయని దేశీయ నంబర్ల విషయంలో సిమ్ కార్డు తీసుకునేటప్పుడు సదరు వినియోగదారుడు నమోదు చేసుకున్న పేరును టెలికాం ఆపరేటర్ డేటాబేస్ నుంచి సేకరించి చూపిస్తుంది.