News7th May 03:12 PMSunil Byrisetty1 min read

విజ‌య‌వాడ బ్రాండ్ ఇమేజ్ టైటిల్ చెప్పండి!

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు పునఃప్రారంభ‌మైన శుభ‌త‌రుణంలో, రాజ‌ధానికి గేట్‌వే న‌గ‌ర‌మైన విజ‌య‌వాడ‌కు గుర్తింపు తెచ్చేందుకు నిర్వ‌హిస్తున్న బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీల‌కు ప్ర‌జ‌ల నుంచి అ

విజ‌య‌వాడ బ్రాండ్ ఇమేజ్ టైటిల్ చెప్పండి!
అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు పునఃప్రారంభ‌మైన శుభ‌త‌రుణంలో, రాజ‌ధానికి గేట్‌వే న‌గ‌ర‌మైన విజ‌య‌వాడ‌కు గుర్తింపు తెచ్చేందుకు నిర్వ‌హిస్తున్న బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీల‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింద‌ని, టైటిల్‌, ట్యాగ్‌లైన్ ఎంపిక‌కు ప్ర‌త్యేకంగా క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఔత్సాహికులు మే 10 వ‌ర‌కు త‌మ బ్రాండ్ టైటిల్‌, ట్యాగ్‌లైన్ ఎంట్రీల‌ను Brandvjacomp.collectorntrdist@gmail.com మెయిల్ ఐడీకి పంపాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఔత్సాహికులు వారి పేరు, చిరునామా, మొబైల్ నంబ‌రును కూడా తెలియ‌జేయాల‌న్నారు. విజ‌య‌వాడ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా స‌రైన బ్రాండ్ నేమ్‌, ట్యాగ్ లైన్‌ను సూచించి, ఎంపికైన వారికి న‌గ‌రంలో స‌ముచిత గుర్తింపు ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇలాంటి గౌర‌వాన్ని సొంతం చేసుకునే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ఔత్సాహికులు ఎంట్రీలు పంపాల‌ని కోరారు.
Vijayawada
District Collector Dr. G. Lakshmi
title competitions
Unprecedented response
బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీల‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న
బ్రాండ్ నేమ్‌
ట్యాగ్ లైన్‌
Scroll for the next article