Politics29th Aug 12:25 PMSunil Byrisetty1 min read
గుర్తింపు లేని రాజకీయ పార్టీలతో సమావేశం
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి గుర్తింపు లేని రాజకీయ పార్టీల (RUPPs) సంప్రదింపు వివరాలు ఎన్నికల కమిషన్ ద్వారా నవీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రశాంతి శుక
తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి గుర్తింపు లేని రాజకీయ పార్టీల (RUPPs) సంప్రదింపు వివరాలు ఎన్నికల కమిషన్ ద్వారా నవీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిగువ పేర్కొన్న గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు సంబంధించి విచారణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, వెలగపూడి, అమరావతి వారి సమక్షంలో సెప్టెంబర్ 8న నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 10:50 గంటలకు భరత్ ప్రజా స్పందన పార్టీ, 11:00 గంటలకు, భారతీయ చైతన్య పార్టీ, 11:30 గంటలకు జై ఆంధ్రా పార్టీ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. హాజరు కావలసిన పార్టీలు భారతీయ చైతన్య పార్టీ రిజిస్ట్రర్డ్, జై ఆంధ్రా పార్టీ రిజిస్ట్రర్డ్,
భరత్ ప్రజా స్పందన పార్టీ అని తెలిపారు. ఈ పార్టీ ప్రతినిధులు పూర్తి వివరాలతో హాజరు కావాలని కలెక్టర్ తెలియ చేశారు.