News4th Nov 04:09 PMSunil Byrisetty1 min read
బెంగళూరులో అన్ రెస్ట్.. అమరావతి ఆహ్వానం
బెంగళూరు మహానగరం ఇప్పుడు సంకుచిత భాషా దురభిమానం, ప్రాంతీయ విద్వేషాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇటీవల కర్ణాటక రక్షణ వేదిక పేరుతో కొందరు తీవ్రవాద భావజాలం కలిగిన కార్యకర్తలు రాష్ట్ర
బెంగళూరు మహానగరం ఇప్పుడు సంకుచిత భాషా దురభిమానం, ప్రాంతీయ విద్వేషాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇటీవల కర్ణాటక రక్షణ వేదిక పేరుతో కొందరు తీవ్రవాద భావజాలం కలిగిన కార్యకర్తలు రాష్ట్ర జెండాలతో ఐటీ కంపెనీల క్యాంపస్‌లలోకి చొరబడి గందరగోళం సృష్టిస్తుండటం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే బహుళజాతి కంపెనీల కార్యాలయాల్లోకి అక్రమంగా ప్రవేశించి, మీ సంస్థలో ఎంత మంది స్థానిక కన్నడిగులు పనిచేస్తున్నారు? రిక్రూట్‌మెంట్ డేటా బయటపెట్టండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఇది సువర్ణావకాశం. ముఖ్యంగా పక్కనే ఉన్న అమరావతి, హైదరాబాద్ నగరాలు బెంగళూరు నుంచి విసిగిపోయిన ఐటీ, టెక్ దిగ్గజాలను ఆకర్షించడానికి అనుకూలమైన పరిస్థితి. హైదరాబాద్ ఇప్పటికే మెరుగైన మౌలిక వసతులు, కాస్మోపాలిటన్ వాతావరణం, సురక్షితమైన శాంతిభద్రతలతో ప్రపంచ స్థాయి పోటీనిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. అమరావతి రాజధానిలో భారీ గ్రీన్-ఫీల్డ్ ఐటీ పార్కులు, రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలతో ముందుకెళ్తోంది. కనుక టెక్ సంస్థలను ఆహ్వానించేందుకు సరిగ్గా ఇదే సరైన సమయంగా అడుగులేయాలి.