News7th Sep 04:00 PMSunil Byrisetty1 min read
ఏపీలో సీఎం యోగి పర్యటన
స్వర్ణభారత్ ట్రస్ట్.. పేదపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహించిన
స్వర్ణభారత్ ట్రస్ట్.. పేదపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలను ట్రస్ట్ హాస్టళ్లలో ఉంచి.. అన్ని రకాల వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలకు చదువు చెప్పడం అనేది గొప్ప సేవ అని కొనియాడారు. యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. కరోనాతో అనేకమంది తల్లిదండ్రులు చనిపోయారని, అనాథలైన చిన్నారులకు అటల్ ఆవాస్ విద్యాలయాల్లో ఉచితంగా విద్య అందిస్తున్నారని వివరించారు. తమ మా రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు వెంకయ్యనాయుడే స్పూర్తి అని చెప్పారు. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వాడుకునే దేశమే ముందుకెళ్తందని యోగి పేర్కొన్నారు.