Technology22nd Oct 04:19 PMSunil Byrisetty1 min read
ఇంట్లోనే ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు!
ఇల్లు మారినప్పుడు కొత్త చిరునామాతో బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్ట్, సిమ్ కార్డులు వంటి ప్రతి చోటా అడ్రస్ అప్‌డేట్ చేయాలంటే మన కీలక గుర్తింపు కార్డు అయిన ‘ఆధార్’లో ముందుగా చిరునామా మార
ఇల్లు మారినప్పుడు కొత్త చిరునామాతో బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్ట్, సిమ్ కార్డులు వంటి ప్రతి చోటా అడ్రస్ అప్‌డేట్ చేయాలంటే మన కీలక గుర్తింపు కార్డు అయిన ‘ఆధార్’లో ముందుగా చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ఉంటే చాలు.. ఎక్కడికీ వెళ్లకుండా.. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో మీ ఆధార్ అడ్రస్‌ను చాలా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. ముందుగా UIDAI అధికారిక myAadhaar పోర్టల్‌ను సందర్శించండి. (వెబ్‌సైట్: https://myaadhaar.uidai.gov.in/) పోర్టల్‌లో లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకుని మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. స్క్రీన్‌పై అడిగిన వివరాలను పూర్తి చేసి, మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి. ముఖ్యగమనిక ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం ఆన్‌లైన్ లాగిన్‌కు అవసరం. లాగిన్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న సేవల్లో చిరునామా మార్పునకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకోండి. పోర్టల్‌లో ప్రస్తుతం కనిపించే సూచనలను అనుసరిస్తూ తదుపరి దశకు వెళ్లండి. మీ కొత్త ఇంటి చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయండి. ఇందులో వివరాలు ఉంటాయి, వాటితోపాటు పేరు, చిరునామాలో అక్షర దోషాలు లేకుండా నమోదు చేయాలి. మీరు నమోదు చేసే వివరాలు సమర్పించే ధ్రువీకరణ పత్రంతో సరిపోలాలి.