Business Type19th Sep 04:17 PMSunil Byrisetty1 min read
యూపీఐపై చార్జీలా.. పెట్రో డీలర్ల డిమాండ్ ఇదే!
యూపీఐ చార్జీల వడ్డనపై పెట్రోల్ బంకుల డీలర్లు కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలు చేయ
యూపీఐ చార్జీల వడ్డనపై పెట్రోల్ బంకుల డీలర్లు కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నిబంధనలపై దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 0.4 శాతం ఎమ్‌డీఆర్ చార్జీ వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్, ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లీటరుకు వచ్చే కమిషన్ రూ. 2.40- 3.40 అయితే, పెద్ద లావాదేవీలపై 0.4 శాతం చొప్పున ఎమ్‌డీఆర్ చెల్లించాల్సి వస్తే పెట్రోల్ పంప్‌లపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొంటున్నారు. ఇంధనం అత్యవసర సరుకు అయినందున పెట్రోల్ బంకులకు ఎమ్‌డీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే యూపీఐ నిలిపివేసి, కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తామని తేల్చి చెబుతున్నారు.