Business Type25th May 12:55 PMSunil Byrisetty1 min read
యూపీఐ మోసాలకు చెక్.. మార్పులివే!
యూపీఐ.. అంటే తెలియని వారు లేరంటే ఆశ్చర్యం లేదు. దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్
యూపీఐ.. అంటే తెలియని వారు లేరంటే ఆశ్చర్యం లేదు.
దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది.
ఇవి జూన్ 30 నుంచి అమల్లోకి వస్తాయి.
మోసాలను తగ్గించి, డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడంలో భాగంగా వినియోగదారులు ఇకపై కస్టమ్ లేదా సేవ్ చేసిన పేర్లను చూడలేరు.
బదులుగా యాప్ వినియోగదారుల అసలు పేరును ప్రదర్శిస్తుంది.
Google Pay, PhonePe, Paytm, BHIM తదితర UPI యాప్‌లు జూన్ 30 తర్వాత, డబ్బు బదిలీ చేయడానికి ముందు, అధికారిక బ్యాంకులో నమోదు చేసిన వినియోగదారుడి పేరును ప్రదర్శిస్తాయి. QR కోడ్‌ను స్కాన్ చేసినా, మొబైల్ నంబర్ లేదా UPI IDని నమోదు చేసినా వినియోగదారుడి అసలు పేరు కనిపిస్తుంది.
UPIలో నకిలీ పేర్లు, QR కోడ్‌ల స్కాములకు చెక్ పెట్టేలా ఎన్పీసీఐ ఈ కొత్త భద్రతా నిబంధనను తీసుకొస్తోంది.