Technology13th Oct 04:38 PMSunil Byrisetty1 min read

యూపీఐ బాదుడు.. తాత్కాలిక వాయిదా

యూపీఐ లావాదేవీలపై కేంద్రం ప్రతిపాదించిన బాదుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. వ్యాపార లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు అమలును స్వల్ప కాలానికి వాయిదా వేసింది. అక్టోబర్‌ 15వ తేదీ నుం

యూపీఐ బాదుడు.. తాత్కాలిక వాయిదా
యూపీఐ లావాదేవీలపై కేంద్రం ప్రతిపాదించిన బాదుడుకు తాత్కాలిక బ్రేక్ పడింది. వ్యాపార లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు అమలును స్వల్ప కాలానికి వాయిదా వేసింది. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి చార్జీలు అమలవుతాయని కేంద్రం తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి బదులు దీపావళి తర్వాత ఈ ఛార్జీల అమలు ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని.. యూపీఐ, సర్వీసెస్‌ స్టీరింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎండీఆర్‌ ఛార్జీల అమలుకు సంబంధించి కచ్చితమైన తేదీని త్వరలో వెల్లడిస్తామని ఎన్‌పీసీఐ పేర్కొంది. పండగ సీజన్‌లో ఎండీఆర్‌ ఛార్జీల వల్ల ఖర్చులు పెరుగుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ నేతృత్వంలోని స్టీరింగ్‌ కమిటీ.. ఛార్జీల అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రకటించింది.
Scroll for the next article