Business Type3rd Dec 01:09 PMSunil Byrisetty1 min read

భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు...

దేశంలో యూపీఐ పేమెంట్లు భారీగా పెరుగుతున్నాయి. నవంబర్‌లో దేశంలో జరిగిన యూపీఐ లావాదేవీల మొత్తం విలువ అక్షరాలా రూ. 26.32 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఇది 22 శాతం

భారీగా పెరిగిన యూపీఐ లావాదేవీలు...
దేశంలో యూపీఐ పేమెంట్లు భారీగా పెరుగుతున్నాయి. నవంబర్‌లో దేశంలో జరిగిన యూపీఐ లావాదేవీల మొత్తం విలువ అక్షరాలా రూ. 26.32 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ. లావాదేవీల సంఖ్య 20.47 బిలియన్ కు చేరింది. గతేడాది నవంబర్ తో పోలిస్తే 32 శాతం ఎక్కువ. కాగా, రోజువారీగా చూస్తే 68 కోట్ల లావాదేవీలు జరిగాయి. రోజుకి సగటున రూ. 87,721 కోట్లు డబ్బు బదిలీ అయింది. అక్టోబర్‌తో పోలిస్తే ఈ మొత్తం 16 శాతం ఎక్కువ. లావాదేవీల సంఖ్య 25 శాతం ఎక్కువ. యూపీఐ సిస్టమ్ లో కేవలం సెకన్లలోనే ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. ఫోన్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా పేమెంట్లు పూర్తి చేయవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ ను కోట్లాది మంది భారతీయుల వినియోగిస్తున్నారు. వీటిని అర్థం చేసుకోవడం చాలా సులభం. పేమెంట్లు కూడా ఫెయిల్ కావడం లేదు. దీంతో దాదాపు ప్రతి ఒక్కరు యూపీఐకి అలవాటు పడుతున్నారు. మరోవైపు అన్ని బ్యాంకులు తమ యాప్ ద్వారా యూపీఐ పేమెంట్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
UPI payments
digital transactions
November data
financial growth
digital India
money transfer
phonepe
google pay
paytm
amazon pay
mobile payments
banking apps
transaction volume
fintech India
cashless economy
Scroll for the next article