News13th Aug 10:37 AMSunil Byrisetty1 min read
సముద్ర కోతకు చెక్.. రక్షణ గోడకు ఎంవోయూ
ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. సముద్ర కోతతో ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా దెబ్బ తింటోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణా
ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. సముద్ర కోతతో ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా దెబ్బ తింటోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.