News24th Sep 11:20 AMSunil Byrisetty1 min read
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి
ఫార్మా పరిశ్రమల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఉప్పాడ మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు తన దృష్టిలో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మ
ఫార్మా పరిశ్రమల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఉప్పాడ మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు తన దృష్టిలో ఉన్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని తెలిపారు. శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని చెప్పారు. అయితే సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నానన్నారు. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించానన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించామని పవన్ తెలిపారు.