Notifications8th Jul 12:24 PMSunil Byrisetty1 min read

యూపీఎస్సీలో రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస

యూపీఎస్సీలో రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బీ’ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ రంగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 17, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసే అవకాశం ఉంది.
Education
UPSC Job Notification
Group A
Group B
Recruitments
Public Sector Undertakings
Gate
Assistant Director
Deputy Superintending Horticulturist
without a written test
Scroll for the next article