News5th Sep 11:08 AMSunil Byrisetty1 min read
యూరియా స్కాం ఆరోపణలు అసత్యం
యూరియా స్కాం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర హోం & విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా కల్పిత ఆరోప
యూరియా స్కాం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర హోం & విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా కల్పిత ఆరోపణలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆమె స్పష్టం చేశారు. “స్కాం పేరుతో కల్పిత ఆరోపణలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. ఇది క్రిమినల్ డిఫమేషన్ మరియు వ్యక్తిత్వహననం కింద వస్తుంది. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,” అని మంత్రి హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద నిజమైన ఆధారాలు ఉంటే అవి వెంటనే దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని, కానీ ఆధారాలు లేకుండా ప్రెస్ మీటింగులు, సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ సభల్లో అబద్ధాలు చెప్పడం సహించబోమని మంత్రి అన్నారు.“ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఎన్నికైన నాయకుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఆధారంలేని ఆరోపణలపై విచారణ జరుగుతుంది. దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవు,” అని మంత్రి అనిత వంగలపూడి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా చెప్పే అబద్ధాలను చట్టపరమైన చర్యలతో ఎదుర్కొంటామని మంత్రి తెలిపారు.