International22nd Jun 08:50 AMSunil Byrisetty1 min read
ఇరాన్ పై అమెరికా దాడి
ఇరాన్ పై అమెరికా దాడికి దిగింది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పోరు జరుగుతున్న సమయంలో అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దా
ఇరాన్ పై అమెరికా దాడికి దిగింది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పోరు జరుగుతున్న సమయంలో అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. “భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం" అని పోస్టు చేశారు. ఈ దాడిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.