International9th Aug 09:52 AMSunil Byrisetty1 min read
ఉద్యోగ మార్కెట్ డీలా!
అమెరికా ఉద్యోగ మార్కెట్ డీలా పడింది. మే, జూన్ నెలల్లో 1,03,000 ఉద్యోగాలను కోల్పోయింది. జూలైలో 23,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అయితే జూలైలో నిరుద్యోగిత రేటు తగ్గిం
అమెరికా ఉద్యోగ మార్కెట్ డీలా పడింది. మే, జూన్ నెలల్లో 1,03,000 ఉద్యోగాలను కోల్పోయింది. జూలైలో 23,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అయితే జూలైలో నిరుద్యోగిత రేటు తగ్గింది. అందుకు కారణం వేలాది మంది జాబ్ మార్కెట్ నుంచి వైదొలగడం, ఉద్యోగాల కోసం పోటీపడే వారి సంఖ్య తగ్గడమని కార్మిక శాఖ వెల్లడించింది. కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్‌లో నిరుద్యోగిత రేటు 4.2 శాతం ఉండగా జులైలో 4.1 శాతానికి తగ్గింది. అయితే దీనికి కారణం 2,64,000 మంది ఉద్యోగాలను కోల్పోవడమే. దీంతో కార్మికుల భాగస్వామ్య రేటు ఐదున్నరేళ్ల కనిష్ట స్థాయి 61.4 శాతానికి పడిపోయి నియామకాలకు ఆటంకం ఏర్పడింది. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్పం. గత ఏడాది కాలంలో 7,20,000 మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.