TTD15th Jul 11:38 AMSunil Byrisetty1 min read

టికెట్లు, వసతి బుకింగ్‌ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించాలి

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య

టికెట్లు, వసతి బుకింగ్‌ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌నే వినియోగించాలి
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన భక్తులకు సూచించారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్‌సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్‌ నెం: 155257 సంప్రదించాలని, అక్కడ అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత అందిస్తారని తెలిపారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు బుకింగ్‌ల పేరుతో సంప్రదించినట్లయితే వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 9866898630 సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Scroll for the next article