News6th Nov 05:01 PMSunil Byrisetty1 min read
టెక్నాలజీ హెల్ప్‌తో ప్రమాదాలు నియంత్రించాలి
డేటా డ్రివెన్ గవర్నెన్స్ సదస్సులో ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో టెక్నాలజీ వినియోగంపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో బస్స
డేటా డ్రివెన్ గవర్నెన్స్ సదస్సులో ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో టెక్నాలజీ వినియోగంపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో బస్సు కాలిపోతే, ఆంధ్రా డ్రైవర్, ఒడిశాలో రిజిస్ట్రేషన్, తెలంగాణ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆలిండియా పర్మిట్ ఇస్తుండటంతో తక్కువ చార్జీలు ఉన్న రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించి, దేశమంతా నడుపుతున్నారని, ఆ రాష్ట్రం వారు సరిగా రెగ్యులేట్ చేయట్లేదని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు. ఏ ప్రభుత్వం పాలసీ చేసినా దాని ఇంప్యాక్ట్, ఇంప్లిమెంటేషన్ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటన జరిగిందన్నారు. శ్రీకాకుళంలో ఒక కొత్త టెంపుల్ కట్టారని, పండుగ రోజున జనం భారీగా రావడంతో 9 మంది చనిపోయారని పేర్కొన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. స్థానిక పోలీసులకు ఎందుకు తెలియలేదని ప్రశ్నించారు. మనం ఇచ్చే వెల్ఫేర్ కరెక్ట్ గా వెళ్లిందా లేదా అనేది, ప్రమాద సంఘటనలు జరగకుండా చూడటం అనేది రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మనదేనని సీఎం చంద్రబాబు వివరించారు. ఏ విషయాన్నైనా మనం మర్చిపోయినా టెక్నాలజీ మనకు హెల్ప్ చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.