National5th Aug 04:49 PMSunil Byrisetty1 min read
ఉత్తరాఖండ్లో బీభత్సం కొట్టుకుపోయిన గ్రామం!
ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ అల్పుడేనన్నది నిరూపించేలా మరో ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారిప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పర
ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ అల్పుడేనన్నది నిరూపించేలా మరో ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారిప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పరిధిలోని ధరావలి గ్రామంలో భారీ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఇక, కొండచరియల కింద పలువురు గ్రామస్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్లు, స్థానిక వనరులతో సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ స్పందించి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో మాట్లాడారు.