News6th Mar 05:27 PMSunil Byrisetty1 min read

తిరుమల అన్నప్రసాదంలో వడల వడ్డింపు

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల (Tirumala)లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యా

తిరుమల అన్నప్రసాదంలో వడల వడ్డింపు
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల (Tirumala)లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభమైంది. దీన్ని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి ఛైర్మన్‌, అధికారులు పూజలు చేశారు. అనంతరం బీఆర్‌ నాయుడు భక్తులకు స్వయంగా వాటిని వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మాట్లాడారు. ''తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో ఒక పదార్థం అదనంగా పెట్టాలనే ఆలోచన కలిగింది. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. ఆయన అంగీకారంతో నేటి నుంచి అన్నప్రసాదంలో వడలను ప్రవేశపెట్టాం. నాణ్యమైన దినుసులతో భక్తులు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు. రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35వేల వడలను భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి రుచికరమైన భోజనం అందిస్తాం'' అన్నారు
TTD
Chairman BR Naidu
Andhra Pradesh
CM Chandra Babu
చంద్రబాబు
తిరుమల
తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Scroll for the next article