News28th Mar 08:52 AMSunil Byrisetty1 min read
వంశీ ఇప్పట్లో బయటకు రారా? బెయిల్ డిస్మిస్
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు సీఐడీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను విజయవాడ సీఐడీ కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బ
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు సీఐడీ కోర్టులో చుక్కెదురైంది.
బెయిల్ పిటిషన్‌ను విజయవాడ సీఐడీ కోర్టు కొట్టివేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి బెయిల్ పిటిషన్‌లను సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వంశీ ఆదేశాలతోనే జరిగిందని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ ఘటనలో వంశీ కీలకమైన వ్యక్తి, అలాగే ఈ కేసులో ముఖ్యమైన నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని వాదనలు వినిపించారు.
ఈ కేసులో ఫిర్యాదు దారుడైన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన ఘటనను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు వంశీపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ ఘటనకు వంశీకి సంబంధం లేదన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఇరువైపులా వాదనలు పరిగణనలోకి తీసుకున్న సీఐడీ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.