Spiritual13th Aug 09:01 AMSunil Byrisetty1 min read
వాడపల్లి ఆలయానికి బ్యాటరీ కార్లు
కోనసీమ ప్రాంతానికి తిరుమలగా పెరు గాంచిన వాడపల్లి దేవస్థానానికి విలువైన విరాళం అందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం జె ఎస్ ఎన్ రాజు కన్స్ట్రక్షన
కోనసీమ ప్రాంతానికి తిరుమలగా పెరు గాంచిన వాడపల్లి దేవస్థానానికి విలువైన విరాళం అందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం జె ఎస్ ఎన్ రాజు కన్స్ట్రక్షన్స్ వారు రూ. 12 లక్షల విలువైన బ్యాటరీ కార్లను బహుకరించారు. ఈ మేరకు భక్తులు విరాళం అందించనున్నట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈనెల 15వ తేదీన ఈ వాహనాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేయడం, ప్రారంభించడం జరుగుతుందని దాత తెలియజేశారని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందిస్తున్న దాతలను ఆయన అభినందించారు.